డిజిటలైజేషన్‌లో ఖమ్మం ముందంజ:మువ్వా

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): డిజిటలైజేషన్‌ పక్రియలో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ ముందు వరుసలో ఉందని ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. ఇప్పటికే సొసైటీలకు మినీ ఏటీఎంలను, కంప్యూటర్లను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల మంది రైతులకు రూపే కార్డులను అందించడం జరిగిందన్నారు. తద్వారా 50 వేల మంది రైతులు ఈ కార్డుల ద్వారా నగదు బదిలీ చేసుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతిపల్లెకు నేడు సహకార సంఘాల సేవలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సొసైటీలు అనేక వ్యాపారాలు చేస్తూ సొసైటీలను లాభాలబాటలో పట్టించడం జరిగిందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా సహకార సంఘాల అభివృద్ధికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ సంపూర్ణ సహకారం అందిస్తుం దన్నారు. గతంతో పోల్చుకుంటే నేడు సహకార సంఘాలు పూర్తిగా బలోపేతం కావడం జరిగిందన్నారు.