డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకున్న రవితేజ
మాస ఆడియన్స్‌కు తగ్గట్లుగా చిత్రీకణ
రామారావు ఆన్ డ్యూటీ విడుదల
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ’రామారావు ఆన్‌డ్యూటీ’ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సింగిల్స్, ట్రైలర్ తో మరింతగా హైపు క్రియేట్ అయింది. రజిషా విజయన్, దివ్యాంశ్ కౌషిక్ కథానాయికలుగా నటించగా, తనికెళ్ళ భరణి, తొª`టటెంపూడి వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రవితేజ పవర్ ఫుల్ డైలాగ్స్ తో సినిమాకి విడుదలకు ముందు మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. డిప్యూటీ కలెక్టర్ గా, హైఓల్టేజ్ మాస్ పెర్ఫార్మెన్స్ తో రవితేజ అదరగొట్టేశాడని చెబుతున్నారు. చట్టానికి లోబడి న్యాయం కోసం ప్రత్యర్ధుల పీచమణిచే ప్రభుత్వ అధికారిగా రవితేజ యాక్టింగ్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో రవితేజ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సాంగ్స్ ఎలా ఉన్నా సామ్ సియస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అంటున్నారు. శరత్ మండవకిది తొలి చిత్రమే అయినా రవితేజను డిఫరెంట్ గా చూపించాడని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశమేంటంటే.. రజిషా విజయ్ భర్త కనిపించకుండా పోయినప్పుడు రవితేజ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ప్రీ ఇంట్రవెల్ లో వచ్చే ్గªట్ సీక్వెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. రెడ్ సాండిల్, కిడ్నాపింగ్ ఎలిమెంట్స్ ఆసక్తిగా కూర్చోబెడతాయని చెబుతున్నారు.ఫస్టాఫ్ సూపర్ గా ఉందని, సెకండాఫ్ నుంచి మరింతగా ఆసక్తి క్రియేట్ అయిందని చెబుతున్నారు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మలుపులతో సినిమా జనాన్ని మేస్మరైజ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ª`లకైమాక్ప్ అయితే రవితేజ ఇదివరకు నటించిన చిత్రాలకన్నా చాలా విభిన్నంగా ఉందని వార్తలొస్తున్నాయి. మరికొందరు సినిమా యావరేజ్ అని చెబుతున్నారు. మొత్తం విూద సినిమాకి ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూలు వస్తుండడంతో రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డట్టే అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రవితేజ హైఓల్టేజ్ మాస్ ప్యాకేజ్ అని కామెంట్లు పెడుతున్నారు.