డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో మృతుల భౌతికకాయాలు

ఘనంగా నివాళి అర్పించిన సిఎం స్టాలిన్‌, తమిళసై తదితరులు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎయిర్‌ మార్షల్‌ చౌధరి

చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి ): హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మందికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. సీడీఎస్‌ రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఢల్లీికి తరలించడానికి ముందుగా.. మిలటరీ హాస్పిటల్‌ నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో వారి పార్థివదేహాలను ఉంచారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌తోపాటు ఏర్‌ చీఫ్‌ మార్షల్‌ వీర్‌ చౌధరీ, తెలంగాణ గవర్నర్‌ తమిళపై  మృతవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం ఏర్‌ఫోర్స్‌ ప్రత్యేక విమానంలో రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఢల్లీిలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం వారి భౌతికకాయాలను నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచుతారు. కామరాజ్‌ మార్గ్‌ నుంచి కంటోన్‌మెంట్‌లోని బ్రార్‌ స్వ్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించున్నారు.అంతకుముందు సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన ప్రాంతాన్ని ఐఏఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి పరిశీలించారు. ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం సంఘటనా స్థలాన్ని ఐఏఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబుతో కలిసి హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించారు. ఆర్మీకి చెందిన అధికారులు ఆయనకు వివరాలు తెలిపారు. మరో వైపు కూలిపోయిన హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ కోసం వింగ్‌ కమాండర్‌ భరద్వాజ్‌ శోధించి గుర్తించారు. ఈ బ్లాక్‌ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్‌ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం తెలియనున్నది.