డిసెంబరు 4,5 తేదీల్లో ఎఫ్‌డీఐలపై చర్చ
ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై డిసెంబరు 4,5 తేదీల్లో లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడం వల్ల నాలుగు రోజుల పాటు సభ సమావేశాల నిర్వహణకు ఆటంకం కలిగిన సంగతి తెలిసిందే. దాంతో అఖిల పక్ష సమావేశం జరిపిన కేంద్రం చర్చకు అంగీకారం తెలిపింది.