డిసెంబర్‌లో భారత్‌-పాక్‌ సరీస్‌

న్యూఢిల్లీ: ఎట్టకేలకు చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మళ్లీ క్రికెట్‌ సమరం మొదలు కాబోతుంది. గత కొంత కాలంగా క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇరు జట్లూ మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్నాయి. ఈ మేరకు రెండు బోర్డుల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చి మళ్లీ క్రిస్‌మస్‌, న్యూఇయర్‌ కోసం వెళ్లే సమయంలో ఈ సిరీస్‌ ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక ప్రభుత్వ అనుమతి కోసమే ఎదురుచూస్తున్నామని, అది రాగానే తేదీలు ఖరారు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్‌య జరగనున్న తొలి ద్వైపాక్షిక సిరీస్‌ ఇదే. ముంబై దాడుల తర్వాత రెండ ఱఉదేశాల మధ్య అన్ని విషయాలలోనూ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తటస్థ వేదికలపై తప్పించే ఇరు జట్లూ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడడం లేదు. పాకిస్థాన్‌ జట్టు చివరిసారిగా 2007లో భారత పర్యటనకు వచ్చింది. తర్వాత గత ఏడాది ప్రపంచకప్‌ కోసం మోహాలీలో అడుగు పెట్టిన పాక్‌, ఢాకాలో జరిగిన ఆసియాకప్‌లో కూడా భారత్‌తో తలపడింది. అయితే పీసీబీ కొత్త చీఫ్‌ జాకా అష్రాఫ్‌ భారత్‌తో బీసీసీఐ పెద్దలతో పాటు పలువురు రాజకీయ నాయకులనూ కలుసుకున్నారు.

బీసీసీఐ పెద్దలతో పాటు పలువురు రాజకీయ నాయకులనూ కలుసుకున్నారు. అయితే బీసీసీఐ సానుకూలంగానే స్పందించినా ప్రభుత్వం వైపు నుంచి అనుమతి కోసమే ఎదురుచూస్తూ వచ్చింది. ఇటీవల రెండు దేశాల విదేశాంగ శాఖల మధ్య జరిగిన చర్చల్లో క్రికెట్‌ సంబంధాలపై బోర్డులకే నిర్ణయాన్ని వదిలీ పెట్టడంతో బీసీసీఐ పాక్‌తో సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. కాగా రెండు దేశాల మధ్‌య సంబంధాలు మెరుగపడడానికి ప్రధాన కారణం మాత్రం ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీ…ఛాంపియన్స్‌ ట్రోఫిక్‌ తమ జట్టును పంపించాలని గత నెలలోనే బీసీసీఐ నుంచి పీసీబీకీ ప్రత్యేక ఆహ్వానం అందింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణానికై పీసీబీ ప్రయత్నిస్తోంది. పాక్‌ నుంచి సెయిల్‌కోట్‌ స్టాలిన్స్‌ ఛాంపియన్స్‌ లీగ్‌లో ఆడనుంది. పాక్‌ టీమ్‌ ఈ టోర్నిలో ఆడడం ఇదే తొలిసారి. తర్వాత బీసీసీఐతో క్రికెట& సిరీస్‌ గురించి చర్చించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు డిసెంబర్‌లో భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన మధ్యలో 10రోజుల విరామం ఉండడంతో ఆ సమయంలో వన్డే సిరీస్‌ నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్‌య సిరీస్‌కు సంబందించి ఇక కేవలం ప్రభుత్వ ఆమోదముద్ర పడడమే మిగిలి ఉంది.