డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
అర్హత గల వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి.
— జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి):
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొనే విధంగా చూడాలన్నారు. ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్లు, దివ్యాంగులు అందరూ ఓటర్ గా నమోదు అయ్యేలా,ఓటు విలువ గురించి అవగాహన కల్పించిప్రోత్సహించాలన్నారు
యువత,అర్హులైన వారు
ఈ నెల 3, 4 తేదీలలో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో నిర్వహించు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను వినియోగించుకుని ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
బూత్ లెవెల్ అధికారుల
వద్ద/ పోలింగ్ కేంద్రాలలో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పాత ఓటర్ కార్డ్ కలిగి ఉన్న వారు కూడా మరొకసారి తమ పేరును జాబితాలో సరి చూసుకోవాలని, మార్పులు, చేర్పులు,సవరణలు ఉంటే వెంటనే ఫారం-8లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు మెంబర్లు,పంచాయతీ కార్యదర్శి, స్వయం సహాయక సంఘాల సభ్యుల సహాయంతో గ్రామంలో క్రొత్తగా వచ్చిన వారిని, అర్హత ఉండి ఓటర్ గా నమోదు చేసుకోని వారిని గుర్తించి, ఓటర్ కార్డ్ కొరకు పేర్లను నమోదు చేసేలా
బి ఎల్ ఓ లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిసెంబర్ 3 మరియు 4 రెండు రోజుల్లో అర్హత ఉన్న వారందరూ ఓటర్ గా నమోదు కావాలని కలెక్టర్ కోరారు