డీఈవోను ట్రాన్స్‌ఫర్ చేస్తూ జీవో విడుదల
పనితీరు బాగాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాధు
బదిలీ రద్ధుకోసం ముమ్మర యత్నాలు
ఖమ్మం (జనంసాక్షి): నాలుగు నెలలుగా విద్యాశాఖలో నెలకోన్న అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు పర్వం… చివరకు డీఈఓ సీహెచ్.వెంకటరెడ్డి బదిలీకి దారితీసింది. జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టడం లో డీఈఓ విఫలమైయ్యారనే ఆరోపణలతో పాటు, చెక్‌స్లిప్ బదిలీల్లో నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఉపాధ్యాముల కౌన్సిలింగ్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్సందిస్తూ సెక ండరీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్‌తివారీ జీవో నంబర్ 447 ద్వారా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ (పుస్తకాల విభాగం)గా కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌కు బదిలీ చేస్తూన్నట్లు పేర్కొన్నారు. ఈ జీవోను తక్షణమే అమలు చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కోరారు.
అధికారులతో సమన్వయ లోపమే కారణమా?
డీఈఓ వెంకటరెడ్డి బదిలీపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 9న బాధ్యతలు చేపట్టిన ఆయనకు మొదటి నుంచి జిల్లాలోని ఉన్నతాదికారులతో సమన్వయం లేదనే చర్చ జరుగుతోంది. పాఠశాలల నిర్వహణలో లోపాలు, ఇతర ఆరోపణలపై పలుఎ సమివేశాల్లో జిల్లా ఉన్నతాధికారులు డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉన్నతాధికారులు కావాలనే తనపై కక్ష పాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పదించిన సదరు ప్రజిప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే మధిర డిప్యూటీ డీఈఓ వెంకటనర్సమ్మ పనితీరు బాగాలేదని, ఆదేశాలను ఖాతరు చేయడం లేదని పలుమార్లు డీఈఓ తన అనుచరుల వద్ద గోడు వినిపించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయుల వేదింపు కేసులో విచారణకు సహకరించ లేదని ఆమేపై డీఈఓ ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో పలువురు ఉన్నతాధికారులు డీస్యూటీ డీఈఓ మద్దతుగా నిలిచారని, ఈ క్రమంలోనే తనను బదిలీ చేయించేందుకు అధికారులు కక్ష కట్టారని డీఈఓ న అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా జిల్లా ఉన్నతాధికారులతోపాటు, విద్యాశాఖలోని పలువురు అధికారుల మధ్య సమన్వయ లోపం చినికి చినికి గాలివానగా మారి చివరకు డీఈఓ బదిలీ దారితీసిందనే విమ్శలు వస్తున్నాయి.
బదిలీ రద్దుకోసం యత్నం: తన బదిలీని రద్దు చేసుకునేందుకు డీఈఓ వ్కెటరెడ్డి ముమ్మర ప్రమత్నాలు చేస్తూన్నారని ప్రచారం సాగుతీంది. జిల్లాలోని ఉన్నతాధికారులు కావాలానే కక్షగట్టి బదిలీ చేయించారని, తప్పు చేసిన వారిని శిక్షించకుండా, తనపై బదిలీ వేలు వేశారని డీఈఓ తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పదో తరగతి మూల్యాంకనం విధుల్లో ఉన్నానని, ఇది పూర్తి చేయడంతో పాటు ఉపాద్యాయులకు బిల్లులు చెల్లింయడం వంటి పనుల కోసం 15 రోజుల గడువు కావాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. కాగా, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఈ వయసులో అటూ, ఇటూ తిరగడం కష్టమంటూ తనకున్న రాజకీయ అధికార బలంతో ఉత్తర్వులను రద్దు చేయించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికి..?: డీఈఓ వెంకటరెడ్డి బదిలీకి ఉత్తర్వులు జారీ కావాడంతో ఇన్‌చార్జి బాద్యతలు ఎవరికి ఇస్తారనేది జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. మధిర డిప్యూటి డీఈఓ వెంకటనర్సమ్మకు బాధ్యతలు అప్పగిసాఈ్తరనే ప్రచారం జరుగుతున్నప్పటీకి,, ఎస్పీ.ఎస్టీ ఉపాద్యాయుల వేధింపు కేసు విషయంలోఆవె పై చర్య తీసుకునే అవకాశం ఉందని, ఆమెకు డీఈఓగా ఇన్‌చార్జి బాద్యతలు అప్పగించడం కష్టమేనని మరికోందరు ఉపాద్యాయులు ఆంటున్నారు. ఏజెస్సీ డీఈఓ రాజేష్‌కు తాత్కాలిక బాద్యతలు అప్పగించి, ఆ తర్వాత డీఈఓ పదీన్నతి జాబితాలో ఉన్న వరంగల్ డైట్ కళాశాల అధ్యాపకులు చంద్రమోహన్‌ను ఇక్కడికి బదిలీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.