డీఎస్సీ నియామకాలకు లైన్ క్లియర్
ఆదిలాబాద్‌్, ఫిబ్రవరి 2 (): ప్రత్యేక ఏజెన్సీ, డిఎస్సీ నియామకాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2011లో 241 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 194 ఎస్‌జిటి, 47 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి డిఈడీ అభ్యర్థులతో పాటు బిఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. దీని వ్యతిరేకిస్తూ బిఎడ్ అభ్యర్థులు ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. సుదీర్ఘ కాలం తర్వాత ఎపి ట్రిబ్యూనల్ ఎస్‌జిటి పోస్టుల నియామకాలు భర్తీలో డిఇడీ అభ్యర్థులు ముందుగా ప్రాధాన్యతనిచ్చి డిఈడీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో బిఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఏజెన్సీ డిఎస్సీ మార్గం సుగమమైంది. కోర్డు ఉత్తర్వుల పట్ల బిఎడ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ డిఎస్సీపై ఉత్కంఠ తొలగడంతో పోస్టుల భర్తీ కోసం అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల అనంతరం నియామకాలు చేపట్టనున్నారు.