డీఎస్‌కు అందలం

4

– ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియామకం

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి):

ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన  పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌ ను ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా  కేబినేట్‌ ¬దాలో నియమించారు. టిర్‌ఎస్‌ లో చేరిన కొద్ది రోజులకే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. డి.ఎస్‌ ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డి.శ్రీనివాస్‌ కు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి వంటివి ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది. కాని ప్రత్యేక సలహాదారులుగా శ్రీనివాస్‌ ను నియమించడం విశేషం.కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా స్వయంగా డి.ఎస్‌ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. టిఆర్‌ఎస్‌ లో వివిధ స్థాయిలలో ఉన్న నేతలకు పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. ఈ నేపధ్యంలో డి.శ్రీనివాస్‌ కు పదవి ఇవ్వడం విశేషం. అంతర్‌రాష్ట్ర సంబంధాల సలహాదారుడిగా ఏడాదిపాటు పదవిలో ఉండేలా  డీఎస్‌కు కేబినెట్‌ ¬దా కల్పిస్తూ సర్కారు జీవోను జారీ చేసింది.ఈ సందర్భంగా డీఎస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బాధ్యతను సీఎం కేసీఆర్‌ తనకు అప్పగించారు. అంతర్‌ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సీఎంకు తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. ఏ కారణంతో టీఆర్‌ఎస్‌లో చేరానో.. అదే దిశలో అడుగులు వేస్తానని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనకు దశాబ్ధంలో పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఉద్ఘాటించారు. విభజన సమస్యలను పరిష్కరించేలా పాటుపడతానని అన్నారు. తెలంగాణ కల సాకారమైనా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు.