డీజే పాటలు వద్దు – బతుకమ్మ పాటలు ముద్దు.

 

 

 

 

 

 

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
పోటో: మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) డీజే పాటలు వద్దు, బతుకమ్మ పాటలు ముద్దు అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పాటల పోటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ లో ఎల్లప్పుడూ ముందుండే జనహిత సేవా సమితి వారు బతుకమ్మ పాటలను ప్రోత్సహించడానికి, దసరా పండగ సందర్భంగా బతుకమ్మ పాటల పోటీల కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. రానున్న కాలంలో కూడా వారు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి తాను అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా డీజే పాటలు వద్దు, బతుకమ్మ పాటలు ముద్దు అనే నినాదంతో బతుకమ్మ సంబరాల్లో వెర్రి తలలు వేస్తున్న నృత్యాలకు అడ్డుకట్ట వేయాలని చేసే ప్రయత్నం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనహిత సేవా సమితి సభ్యులు, పాల్గొన్నారు .