‘డీవైసీ’ తో సమస్యల పరిష్కారం
కరీంనగర్, జనంసాక్షి : డయల్ యువర్ కలెక్టర్ (డీవైసీ) కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులను సమావేశ పరిచి సోమవారం డీవైసీ కార్యకమాన్ని నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన భూమిని ఇతరులకు విక్రయించి మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.దీరిపై జేసీ స్పందిస్తూ.. తహసీల్దార్ ద్వారా విచారణ జరిపించి చర్య తీసుకుంటామన్నారు. ఎలిగేడు మండలం నుంచి ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి భూ పంపిణీలో పట్టాలు పొందిన వారు భూమిని విక్రయిస్తున్నారని దృష్టికి తీసుకురాగా విచారించి చర్చ తీసుకుంటామన్నారు. డీఆర్వోకే కృష్ణా రెడ్డి, జడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, డీఆర్డీఓ, డ్వామా పీడీలు శంకరయ్య , మనోహర్ ఉన్నారు.