డైమండ్ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం
అదిలాబాద్ జిల్లా : నగరంలోని తిరుపల్లి వద్ద డైమండ్ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న పత్తిబేళ్లు తగలబడటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.