డైవర్‌ అజాగ్రత్త మూల్యం.. ఒక నిండు ప్రాణం

హర్వేష్టర్‌ క్రింద పడి హర్షవర్ధన్‌ బాలుడి మృతి

– శోకసంద్రంలో కుటుంభం

వీర్నపల్లి నవంబర్‌ 11 (జనంసాక్షి): హర్వెష్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఓ పసివాడి ప్రాణాలు గాలిలో కలిసాయి. వివరాల్లోకి వెళితే వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలోని భూక్య తిరుపతి కుమారుడు భుక్య హర్షవర్ధన్‌(2) హార్వెస్టర్‌ డ్రైవర్‌ గుగులోత్‌ రమేష్‌ అజాగ్రతకం నడపడం వలన కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.భూక్య తిరుపతి తండ్రి మంగ్యకు రెండు ఎకరాల భూమి కలదు గత నాలుగు సంవత్సరాలుగా వర్షం లేక కరువు వలన ఉపాధి నిమిత్తం ఇరాక్‌ వెళ్ళాడు.తిరుపతి రజిత కు ఏకైక కుమారుడు హర్షవర్ధన్‌ రజిత ఈ సంవత్సరం వర్షాలు పడడం వలన రెండు ఎకరాల భూమిని వరి పంటను రజితనే సాగుచేయడం వ్యవసాయం పనులు చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటుంది. పంట కోతకు రావడం వలన వట్టిమల్ల చెందిన హర్వేష్టర్‌ ఆదివారం సాయంత్రం పొలాన్ని కొయడానికి రావడం జరిగింది. అ సమయంలో రజిత తన కొడుకును హర్షవర్ధన్ను తిసుకోని పొలం వద్దకు తీసుకెళ్లి వరి మడిలో ఉంచింది. బాలుడు పొలం వద్ద ఆడుకుంటుడటంతో ఆ సమయంలో వరి కోస్తున్న డ్రైవర్‌ గమనించక నిర్లక్ష్యంగా నడపడంతో హర్వెష్టర్‌ బాలుడిని ఢీకొంది.దాంతో బాలుడు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్తలాన్ని ఎస్‌ఐ లాలా మరళీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.