డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 29 మందిపై కేసులు
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు డంకెన్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లిహిల్స్ వద్ద జరిపిన తనిఖీల్లో 12 కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మరోవైపు బేగంపేట లైఫ్ సెల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 29 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టుకు హాజరపరచనున్నట్లు తెలిపారు.