డ్రంక్ అండ్ డ్రైవ్ లో 11 మందికి జైలు శిక్ష
వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి):
పుష్పరెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి కిసెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప 11 మందికి జైలు శిక్ష విధించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు. ఈ 11 మందికి 2 రోజుల జైలు శిక్ష విధించి పరకాల సబ్ జైల్ కు పంపినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు.అలాగే మరో 27 మందికి 39,500/- రూపాయలు జరిమానా విధించారు.