డ్రా అయిన భారత్- ఇంగ్లాండ్ టెస్ట్
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి రోజు 49 ఓవర్లలో 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన విరాట్ సేన 172/6తో నిలిచింది. దీంతో ఇరుజట్ల మధ్య సిరీస్ మళ్లీ డ్రాతో ఆరంభమైంది. రాజ్‌కోట్‌లో కుక్, హమీద్‌లు 180 పరుగు ల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకు ముందు 179 పరుగుల రికార్డును వీరిద్దరు అధిగ మించారు. టాప్ ర్యాంక్ ఇండియాపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ సెంచరీతో సత్తా చాటాడు. భారత్ పర్యటనలో ఏ కెప్టెన్ సాధించని విధంగా ఐదో శతకంతో తన సెంచరీలను 30కు పెంచుకు న్నాడు. భారత్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. బోర్డులో ఒక్క పరుగు చేరకుం డానే గంభీర్ వోక్స్ బౌలింగ్‌లో అవుట య్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగుల చేసిన గంభీర్ మరోసారి నిరాశ పర్చాడు. మురళీ విజ రుతో కలిసి పుజారా ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో 47 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 68 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ శిబిరంలో అలజడి రేగింది. ఈ దశలో బరిలో దిగిన కోహ్లీ జట్టును రక్షణాత్మక దిశగా నడిపించాడు. మిడిల్ ఆర్డర్‌లో అశ్విన్, కోహ్లీ ఐదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఏడో వికెట్‌కు కోహ్లీ, జడేజాలు అద్భుతమైన భాగ స్వామ్యం భారత్‌కు కొండంత అండగా నిలిచింది. కీలకమైన సమయంలో జడేజా మరోసారి ఆదుకు న్నాడు. 32 పరుగుల నాటౌట్‌గా (33 బంతుల్లో ఆరు ఫోర్లు) చూడ చక్కని షాట్లతో అలరించాడు. విరాట్ కోహ్లీ 49 పరుగులు (98 బంతుల్లో ఆరు ఫోర్ల)తో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆలీకి 3, వోక్స్, అన్సారీ, మొయిన్ ఆలీకి చెరో వికెట్ లభించాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిం చిన ఆలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.