డ్రైవర్లకు, జర్నలిస్టులకు ప్రమాద భీమా

2

హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి):

జర్నలిస్టులు, నాన్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ డ్రైవర్లు, ¬ంగార్డులు 10 లక్షల మందికి ప్రమాద బీమా కల్పించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వారందరికీ ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. ఈ పథకం 22-08-2015 నుంచి అమలులోకి వస్తుందని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీమా పథకం ప్రవేశపెడుతున్నామని నాయిని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 రూపాయలు ప్రీమియం వసూలు చేయగా? కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా 9 లక్షల 68 వేల 689 మంది డ్రైవర్లు, 21,289 మంది ¬ంగార్డులు, 10 వేల 31 మంది వర్కింగ్‌ జర్నలిస్టులు లబ్ధిపొందుతారని మంత్రి వివరించారు. వీరంతా జిల్లాల్లో డిపిఆర్‌ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి నాయిని సూచించారు.

ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు, పోలీస్‌ అధికారులతో కలిసి ¬ం మంత్రి నాయిని సచివాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.