ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు
వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని అందుబాటులోకి తసీఉకుని వస్తున్నారు. అత్యవసరంగా ప్రమాదం జరిగితే తోణ చర్యలకు వీఉల కలిగేలా చేస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడిరచారు.ఎయిమ్స్‌ లో అత్యవసరంగా అగ్నిని ఆర్పేందుకు వీలుగా ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఢల్లీి ఫైర్‌ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. అగ్నిమాపక కేంద్రాన్ని ఎయిమ్స్‌ ఏర్పాటుచేస్తుండగా, అందులో పనిచేసే సిబ్బందిని ఢల్లీి అగ్నిమాపక శాఖ నియమిస్తుందని అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఘటన ఎయిమ్స్‌ కు దక్కనుంది. ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు తలెత్తినపుడు వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక కేంద్రం ఉపయోగపడుతుందని డాక్టర్‌ గులేరియా వివరించారు.