ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం నేరుగ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలవనున్నారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు.