ఢిల్లీపై ‘పంజా’బ్
ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టు
ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టుహిమాచల్ :ధర్మశాలలో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పంజా విసిరింది. ఏడు పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ గిల్‌క్రిస్ట్ 26 బంతులు ఆడి 42 (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసి పటాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. మార్ష్ 44 బంతుల్లో 45 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మార్కెల్ బౌలింగ్‌లో పటాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అజార్ మహ్మద్ 13 బంతుల్లో 9, మిల్లర్ 24 బంతుల్లో 44 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. సతీశ్ 22 పరుగులు చేయగా చావ్లా ఎలాంటి పరుగులు చేయకుండా నాటౌట్‌గా మిగిలాడు. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లు ఆడి 164/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యం చేరుకునేందుకు ఢిల్లీ జట్టు తడబడుతూ ఆడింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ జయవర్ధనే 42 బంతుల్లో 39 పరుగులు చేసి శర్మ బౌలింగ్‌లో వొహ్రాకు క్యాచ్ ఇచ్చాడు. చంద్ 8 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పటాన్ వెంటనే వికెట్ పోగొట్టుకున్నాడు. 7 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి శర్మ బౌలింగ్‌లో గిల్‌క్రిస్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ డకౌట్ ఎలాంటి పరుగులు చేయకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. సహ్వాగ్ 22 బంతుల్లో 30, రోహ్రర్ 29 బంతుల్లో 49, గౌతం గంభీర్ (నాటౌట్) 12 పరుగులు చేసి లక్ష్యానికి ఏడు పరుగుల దూరంలో ఓడిపోయారు. పంజాబ్ బౌలర్లలో సందీప్‌శర్మ మూడు వికెట్లు, చావ్లా రెండు, ప్రవీణ్‌కుమార్, ఆవానా చెరో వికెట్ తీశారు. ఢిల్లీ బౌలర్లల నెహ్రా రెండు, మార్కెల్, పఠాన్ ఒక్కో వికెట్ తీశారు. ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టు