ఢిల్లీపై రెఫరెండం నిర్వహించండి

2
స్వయంప్రతిపత్తికి కేజ్రీవాల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి): పూర్తిస్థాయి రాష్ట్ర ¬దా కోసం ఢిల్లీలోనూ బ్రెగ్జిట్‌లాంటి రెఫరెండమ్‌ నిర్వహిస్తామని సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. తొందర్లోనే ఆ రెఫరెండమ్‌ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి

రాష్ట్ర ¬దా కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ¬దా వల్ల ఢిల్లీ ప్రభుత్వానికే పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో పోలీసింగ్‌, భూవ్యవహారాలు వంటి కీలక అంశాల నియంత్రణ కేంద్ర పరిధిలోనే ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ¬దా అన్నది ఆప్‌  హావిూల్లో ఒకటి. ఆప్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేజీవ్రాల్‌ ఇటు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌తో, అటు కేంద్రంతో కయ్యానికి దిగుతూనే ఉన్నారు. గతంలో బీజేపీ కూడా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర¬దా కోసం డిమాండ్‌ చేసినా గత ఎన్నికల మేనిఫెస్టో నుంచి దాన్ని తొలగించింది. బ్రిటన్‌ రిఫరెండమ్‌ తీర్పు వచ్చిన కాసేపటికి కేజీవ్రాల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. తొలుత కేంద్ర పాలిత కేంద్రంగా ఉన్న ఢిల్లీకి.. తర్వాత పరిమిత అధికారాలతో రాష్ట్ర ¬దా ఇచ్చారు.