ఢిల్లీలో చీకటి రోజులు

K

– ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించారు

– అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మొహానియాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మాటలయుద్ధానికి దిగారు. ట్విట్టర్‌ వేదికగా ప్రధానిపై విమర్శలు చేశారు. దేశ రాజధానిలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించారని ట్వీట్‌ చేశారు. దిల్లీ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతూ.. అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సంగం విహార్‌ ఎమ్మెల్యే దినేశ్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నీటి సరఫరా సరిగ్గా లేదని ఫిర్యాదు చేయడానికి దినేశ్‌ కార్యాలయానికి వెళ్లిన మహిళల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదైంది. తమను కార్యాలయం నుంచి బయటకు తోసేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ దిల్లీలోని ఖాన్‌పూర్‌ ప్రాంతంలో విూడియా సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి దినేశ్‌ను అరెస్టు చేశారు. దినేశ్‌ మొహానియాపై మరో కేసు కూడా నమోదైంది. తుగ్లఖాబాద్‌ ప్రాంతంలో ఓ వృద్ధుడిపై చేయిచేసుకున్నాడన్న ఆరోపణలతో గోవింద్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ పరిస్తఙతి ఎందుకు వచ్చిందని ఆప్‌ నేతలు మండిపడ్డారు. కావాలనే ఢిల్లీలో ఇలాంటి గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. అసలేం జరిగిందంటే..ఓ మహిళను తిట్టాడన్నకేసులో స్థానిక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మొహానియాను దిల్లీ పోలీసులు విూడియా సమావేశంలో ఉండగానే అరెస్ట్‌ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆప్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇది బిజెపి, పోలీసుల గుండాగిరీకి నిదర్శనమని దినేశ్‌ అరోపించారు. ఇటీవల నీటి సరఫరా సరిగ్గా లేదని ఫిర్యాదు చేయడానికి దినేశ్‌ కార్యాలయానికి వెళ్లిన మహిళల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదైంది. తమను కార్యాలయం నుంచి బయటకు తోసేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో జూన్‌ 23న కేసు నమోదైన సంగతి తెలిసిందే. దినేశ్‌ ఈరోజు దక్షిణ దిల్లీలోని ఖాన్‌పూర్‌ ప్రాంతంలో విూడియా సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దినేశ్‌ మొహానియా సంగమ్‌ విహార్‌ ఎమ్మెల్యే. దిల్లీ జలమండలి వైస్‌ ఛైర్మన్‌ గా కూడా ఉన్నారు. దినేశ్‌ మొహానియా  ఓ 60ఏళ్ల వ్యక్తిని కొట్టాడని ఆరోపణలతో మరో కేసు నమోదైంది. తుగ్లఖాబాద్‌ ప్రాంతంలో వృద్ధుడు తనను గుర్తుపట్టలేదనే కారణంతో దినేశ్‌ అతడిని కొట్టినట్లు ఫిర్యాదు అందడంతో గోవింద్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దినేశ్‌ అనుచరులు కూడా వృద్ధుడిపై దాడి చేసి కొట్టారని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.  అయితే శనివారం  దినేశ్‌ మోహనియా విూడియా సమావేశంలో మాట్లాడుతుండగానే పోలీసులు అతన్ని లాక్కెళ్లారు.  ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాధికారి ఎంఎం ఖాన్‌ హత్యకు గురైన కేసులో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే దినేశ్‌ విూడియాకు తెలిపారు. ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే విూడియాతో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడకు పోలీసులు చేరుకున్నారు. మైక్‌ ముందు దినేశ్‌ మాట్లాడుతుండగానే పోలీసులు అతన్ని పట్టుకెళ్లారు. ఓ మహిళను వేధించిన కేసులో దినేశ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఎంఎం ఖాన్‌ హత్యకేసును పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దినేశ్‌ ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల గూండాగిరిని విూరు స్వయంగా చూస్తున్నారు.. వాళ్లు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు’  అని విలేకరులనుద్దేశించి అన్నారు. నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ దినేశ్‌పై  ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారని ఆమె చెప్పారు. దినేష్‌ మోహనియాపై కేసు పెట్టి.. అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.