ఢిల్లీలో బేరసారాల కోసమే వైకాపా వ్యాఖ్యలు:బాబు
అనంతపురం: అవిశ్వాస తీర్మాణం ఎప్పుడు పెట్టాలో తెలియకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ప్రభుత్వంపై తాము ఎప్పుడు అవిశ్వాస తీర్మాణం పెడితే ఢిల్లీకి వెళ్లి బేరాలు చేసేందుకే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో స్థానికులతో చంద్రబాబు మాట్లాడారు.