ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం

central government take decision to lift the President

హైదరాబాద్: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ సహాకారంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. లోక్‌జన్‌పాల్ బిల్లుకు శాసన సభ వ్యతిరేకించడంతో నిరసనగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మళ్లి జరిగిన ఎన్నికల్లో ఆప్ సంపూర్ణ మెజార్టీ సాధించి రేపు రాంలీలా మైదానంలో కేజ్రీవాల్, ఏడుగురు మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయనుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను ఎత్తేసింది.