ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించిన రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.