ఢిల్లీ కాలుష్యానికి చెక్ చెప్పే మాస్క్ లు

41462533566_625x300న్యూఢిల్లీ : రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో గాలిపీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాలుష్యం గురించి చెప్పనక్కరలేదు. సరి-బేసి విధానం తీసుకొచ్చిన వాతావరణంలో కాలుష్యం తగ్గలేదని నిపుణులంటున్నారు. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనోక్సైడ్ వంటి కెమికల్స్ తో కాలుష్యమైన గాలి నుంచి బయటపడాలంటే ఎయిర్ మాస్క్ లను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బయటికి వెళ్తున్న ప్రతిసారి మాస్క్ లను ధరించాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అందుబాటులో సర్జికల్, ఇండస్ట్రియల్ ఎయిర్, ఎన్95 మాస్క్ ల్లో మూడోది వాతావరణ కాలుష్య ముప్పునుంచి ఎక్కువగా కాపాడుతుందని చెప్పారు.

సర్జికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ మాస్క్ ల్లో ఉన్న లోటు పాట్లు ఈ ఎన్95 మాస్క్ లో లేవని తెలిపారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న మాస్క్ లో ఎన్95 మాస్క్ లకు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఈ మాస్క్ లు ధరించడం వల్ల హానికరమైన గ్యాస్ ల బారినుంచి బయటపడొచ్చని తెలిపారు. ఈ మాస్క్ లు ధరించడం వల్ల గాలి పీల్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. కాలుష్య వాతావరణంలో బయటికి వెళ్లే వారికి ఈ మాస్క్ లు బెస్ట్ ఆప్షన్ గా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.