ఢిల్లీ గడ్డపైన తాండూరుకు వాసులకు అరుదైన గౌరవం
ఢిల్లీ గడ్డపైన తాండూరుకు వాసులకు అరుదైన గౌరవం
తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి) జాతీయ స్థాయిలో తాండూరుకు చెందిన ఇద్దరికి పురస్కారాలు లభించాయి. పట్టణ వాసులైన కందుకూరి రాజ్ కుమార్ గత 30 సంవత్సరాలుగా బీసీల చైతన్యానికి, బీసీల సమస్యల పై నిరంతర పోరాటల ద్వారా బహుజనవాద వ్యాప్తికి కృషి చేస్తూ తాండూరులో బీసీ వాదానికి మారుపేరుగా నిలిచినందుకు ఆయనకు బహుజన సాహిత్య అకాడమీ వారు “మహాత్మా జ్యోతిరావు ఫూలే” జాతీయ పురస్కారం ఢిల్లీలో ఆదివారం ప్రదానం చేశారు. తాండూరుకు చెందిన పర్యాద రామకృష్ణకు విద్యారంగంలో ఉంటూ సామాజిక ఉద్యమాల్లో ముందుంటు,మహనీయుల భావజాల వ్యాప్తికి, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరేవిధంగా మార్గనిర్దేశం చేస్తున్నందుకు గాను ఆయనకు బహుజన సాహిత్య అకాడమీ వారు ఢిల్లీలో ఆదివారం “జాతీయ విద్యారత్న” పురస్కారం ప్రదానం చేశారు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ బహుజన రైటర్ నాలుగవ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథులుగా బహుజన రాజ్యాధికార పితామహుడు మాన్యవర్ కాన్సిరాం సొంత చెల్లెలు స్వర్ణ కౌర్, ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ జి, బహుజన సాహిత్య అకాడ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ మల్లేష్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ ల చేతుల మీదుగా వీరి ఇరువురికి “మహాత్మా జ్యోతిరావు ఫూలే” జాతీయ పురస్కారం, పర్యాయ రామకృష్ణకు జాతీయ విద్యారత్న ప్రదానం చేశారు తాండూరు వాసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల పట్టణం వాసులు హర్షం వ్యక్తం చేశారు.