తండా పంచాయితీలపై తేలని లెక్క

ఖమ్మం,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. అదేవిధంగా మిగిలిన గ్రామాలను నూతన పంచాయతీల్లో ఏర్పాటు చెయ్యాలా, పాత పంచాయతీల్లోనే కొనసాగాలా అనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. జిల్లాలో 65 తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు, డిసెంబరులో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ఎక్కువ శాతం పరోక్షంగానే జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పక్షాన ప్రజలు ఉండేలా చేయాలని, అభివృద్ధి విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని మంత్రి తుమ్మల వివరించారు. పాస్‌పోర్టు తరహాలో ఉండే పట్టాదారు పాసు పుస్తకాలను ధరణి కార్యక్రమం ద్వారా మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రైతులకు అందజేయనున్నామని, ఇది దేశ చరిత్రలోనే ఉన్నతమైన, విభిన్నమైన ప్రయోగమని వివరించారు. రెవెన్యూ వ్యవస్థ తలనొప్పిగా ఉంటుందని, గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదని, రైతులకు ప్రధానంగా వచ్చేది భూమి సమస్యలేనని, దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన పక్రియ చేపట్టిందని స్పష్టం చేశారు. మొత్తంగా పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు.