తండ్రికి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ – ప్రపంచ దేశాల్లో తెలంగాణకు పేరు తెచ్చిన మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పట్నం మాణిక్యం 

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 24  ::తండ్రి కెసిఆర్ కి  తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని,  ప్రపంచ దేశాల్లో తెలంగాణకు  మంచి పేరు తెచ్చిన మంత్రి గా ముందుకు సాగుతున్న ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని మెదక్ ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. మంత్రి కేటీఆర్  జన్మదిన వేడుకలు సంగారెడ్డి పట్టణం లోని  ఐబి లో సోమవారం  అంగరంగ వైభవంగా  పట్నం మాణిక్యం  ఆధ్వర్యంలో వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా పట్నమాణిక్యం, కేక్ కట్ చేస తెలంగాణను  ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ముందుకు సాగుతూ మంచి పేరు తెచ్చారన్నారు. ఐటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న సేవలు ఘనమైనవి అని, తండ్రికి తగ్గట్టుగానే తనయుడు కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నా అన్నారు అనంతరం మాణిక్యం ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  పట్నం మాణిక్యంతో పాటు ప్రభుత్వాసుపత్రి ఆర్ ఎం ఓ  రవికుమార్,  తెలంగాణ ఉద్యమకారులు బీరయ్య యాదవ్ , కొండాపూర్ మండల ఎంపీపీ మనోజ్ రెడ్డి,  వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర మహిళ నాయకురాలు మందుల వరలక్ష్మి , కొండాపూర్ మండలం రైతుబంధు అధ్యక్షులు మల్లేశం , బిఆర్ఎస్ నాయకులు నగేష్ , బిక్షపతి గారు,ప్రేమానందం,  ప్రతాప్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బందిమరియు పిఎంకే యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.