తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసిన కొడుకు

గోదావరిఖని: ఎన్టీపీసీ జ్యోతి నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ తన తండ్రిపై దాడి చేసి హత్య చేశారు. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో అపరేటర్‌గా పనిచేస్తున్న బుద్ధ ప్రసాద్‌ భార్య, పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న శ్రీనివాస్‌ మంగళవారం మధ్యాహ్నం ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్ద కనిపించిన తన తండ్రి తలపై ఇనుపరాడ్డుతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.