తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం

కమాన్‌పూర్‌, జనంసాక్షి: మండలంలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వరి ధాన్యం పూర్తిగా తడవడంతో బుధవారం మంథని ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం పరిశీలించారు. దీంతోపాటు రొంపికుంట, నాగారం, పేరపల్లి గ్రామాల్లో పంట పొలాలను ఆమె పరిశీలించారు. నష్టపోయిన రైతులకు సర్వే చేయించి ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్ధార్‌ సత్తయ్య, వీఆర్‌వో మల్లేశ్‌, మాజీ ఎంపీటీసీ కటకం నారాయణలు ఆమెతో పాటు ఉన్నారు.