*తడి పొడి నీటి యాజమాన్య పద్ధతి ద్వారా వరిసాగులో అధిక లాభాలు*

సూర్యాపేట జిల్లా మేనేజర్ జి షాన్

మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ గోపిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన గ్రామ రైతులకు వరి సాగులో తడి పొడి నీటి యాజమాన్య పద్ధతిని గూర్చి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ జి షాన్ మాట్లాడుతూ, రైతులందరూ కూడా వరి సాగులో ఎక్కువ మోతాదులో నీటిని వాడడం ద్వారా దిగబడి తగ్గుతుందని, చీడపీడలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా మిథేన్ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి పెరిగి పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. కనుక రైతులు ఈ తడి పొడి పద్ధతి అవలంబించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారిగాను, వరి సాగులో అధిక లాభాన్ని సాధించినవారుగాను మంచి ఫలితాలు కలిగి దిగుబడి పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గోపిరెడ్డి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ కాంపాటి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ ఎం.రోశయ్య, మునగాల మండల కోఆర్డినేటర్ గట్టిగండ్ల రాము, నడిగూడెం మండల కోఆర్డినేటర్ సింగిరెడ్డి శేఖర్ రెడ్డి, గ్రామ రైతులు గోపిరెడ్డి వీరారెడ్డి, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, కొలుకులపల్లి సంజీవరావు, అన్నెం శ్రీనివాసరెడ్డి, అన్నెం బుచ్చిరెడ్డి, డి.స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.