తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే
భారతీయ తత్వాం అత్యున్నతమైన సంపద
విదేశీ తత్వవేత్తను మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్
న్యూఢల్లీి,సెప్టెంబర్4 జనం సాక్షి : భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, మెప్పించి
న ధీశాలి దివంతగ రాష్ట్రపతి సర్వేపల్లి ఆధాకృష్ణన్. అతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించాడు. అతని దృష్టిలో తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక మార్గం. భారతీయ తత్వాన్ని అర్ధం చేసు కోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించాడు. అందులో వివేకం, తర్కం ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. రాధాకృష్ణన్‌ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారి వృత్తి చేయమ న్నాడు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతి మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరాడు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గంటల పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవాడు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతిగా పనిచేశాడు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశాడు.
తను రాసిన ’ఇండియన్ ఫిలాసఫీ’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాడు. ’యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్’లో సభ్యుడిగా ఉండి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. 1952లో బారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టాడు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. ఏనాడూ ఎటువంటి ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనం లో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చాడు.ªూధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై, ప్రేమాభిమానాలు చూపేవాడు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి, తమ గురువును కూర్చోబెట్టి, రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. ªూధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న జన్మించారు. భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ
రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్`ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్`ఛాన్సలర్‌గా కూడా
ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.