తనపై బురదజల్లే ప్రయత్నాల్లో దుష్పచ్రారాలు

పుకార్లపై టిఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

టిఆర్‌ఎస్‌ పార్టీని వీడేది లేదు..కేసిఆర్‌ నాయకత్వాన్ని వదిలేది లేదు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తా

వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురేస్తాం

డిప్యూటి సిఎం కడియం వివరణ

వరంగల్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): కొందరు తనపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగగంఆ తాను కాంగ్రెస్‌లోకి వెళతానంటూ ప్రచాచరం చేయడం..కొన్ని మాధ్యమాలు వాటిని ప్రచారం చేయడం జరుగుతోందని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రాజకయీంగా ఎదుర్కోలేని వారు, తన ఎదురుదలను సహించలేని వారు ఇలాంటి ప్రచారాలకు ఒడిగుడుతన్నారని మండిపడ్డారు. పుకార్ల షికార్లకు, అర్ధంలేని ఆరోపణలకు, బురదచల్లే దుష్పాచ్రారాలకు కడియం శ్రీహరి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి జీవితంలో ఇప్పటి వరకు ఓటుకూడా వేయలేదని, ఆ పార్టీకి వెళ్తానన్న చవకబారు ప్రచారాలు నాలాంటి వారిపై చేయడం తగదని అన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీని వీడేది లేదని, కేసిఆర్‌ నాయకత్వాన్ని కాదనేది లేదని స్పష్టం చేశారు. మచ్చలేని వ్యక్తినని పిలిచి నన్ను ఉప ముఖ్యమంత్రిని చేసిన కేసిఆర్‌ నాయకత్వాన్ని వదిలి వెళ్లేది లేదన్నారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా పార్టీని వీడేది లేదన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తనతో ఉండేవాళ్లుకూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు వివరించారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తానని, వరంగల్‌ లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్‌ లో 12 నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేస్తామని, రాష్ట్రంలోకూడా వందసీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ ప్రభుత్వంగా టిఆర్‌ఎస్‌ పార్టీ గతంలో కంటే ఎక్కువసీట్లు గెలిచి కొత్త రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. ఇదంతా ఓర్వలేని వారు టిఆర్‌ఎస్‌ను,తనను దెబ్బతీసేందుకు ఆడుఉతన్న నాటకంగా ఆయన అభివర్ణఙంచారు. పుకార్లతో రాజకీయ పబ్బం గడుపుకునే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన టిఆర్‌ఎస్‌ శ్రేణులకు సూచించారు. మహాకూటమి కేవలం అధికారం కోసం రాజకీయాలు చేస్తుందని, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడం లేదని కడియంశ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై పుట్టిన తెలుగుదేశం కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంటే స్వర్గియ ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలంగాణ ద్రోహుల పార్టీ టిడీపి గా అభివర్ణించిన కోదండరామ్‌ ఏ ప్రాతిపదికపై ఆ పార్టీతో నేడు పొత్తు పెట్టుకున్నారన్నారు. మహకూటమి లోని పార్టీలు విభిన్నదృక్పథాలు కలిగి ఉన్నాయని, ఎప్పుడు చీలిపోతాయో కూడా తెలువదన్నారు. పొత్తులు కుదరక కుక్కలు చింపిన విస్తరిగా కూటమి తయారవుతుందన్నారు. మహా కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాజకీయాల్లో వారసులు తాము కోరుకుంటే రారని, ప్రజలు కోరుకుంటే వారసులు వస్తారని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ ఘన్పూర్‌ ప్రజలు నేను అభ్యర్థిగారావాలని కోరుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుందని అన్నారు. వారి రుణం తీర్చుకోలేని దని, వారి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. వారి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయంగా స్వర్గియ ఎన్టీఆర్‌ తనకు ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు కేసిఆర్‌ కూడా ఊహించని విధంగా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఈ రెండు ఘటనలు జీవితంలో మర్చిపోలేనివన్నారు. తాను ఏనాడు

అవకాశాల కోసం ఎదురు చూడలేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం మాత్రమే చేశానన్నారు. నాడు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రుల ప్రమాణస్వీకారానికి రాజ్‌ భవన్‌ కు వెళ్లేందుకు పాస్‌ లు కావాలని వెళ్తే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే నీకు పాసులెందుకుని స్వర్గియ ఎన్టీఆర్‌ నన్ను రాజ్‌ భవన్‌ కు తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారు కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌ రిసెప్షన్‌ కు ఆయన కారులో నన్ను కూర్చోబెట్టుకుని ఎంపీగా

రాజీనామా చేస్తే వరంగల్‌ లో మళ్లీ గెలుస్తామా? అని ప్రశ్నించి, నువ్వు రాజీనామా చేయాలని, రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారని తెలిపారు. ఇంతటి గౌరవాన్నిఇచ్చిన కేసిఆర్‌ని వదిలి వెళ్లేది లేదని, పార్టీని వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇక పార్టీలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆశావహులు అసమ్మతులు సర్వసాధారణమని,త్వరలోనే అన్ని సద్దుమణుగుతాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌ లో కొండా దంపతులు పార్టీకి రాజీనామా చేయడం వల్ల ఆనియోజకవర్గం నేతలు సంకెళ్లు వీడి స్వాతంత్రం పొందినట్లు చెబుతున్నారని తెలిపారు. కొండా దంపతులు తాము ఆరు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ నేతలను గెలిపించి,రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తూర్పు నియోజక వర్గంలో గెలువలేమని,పరకాల నియోజక వర్గానికి పారిపోతున్న కొండా దంపతులు అక్కడ కూడా గెలువలేరని,ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డే గెలుస్తారని చెప్పారు. వరంగల్‌ లో ఒక్క నియోజకవర్గంలో కూడా కొండా దంపతుల ప్రభావం లేదని, మహా కూటమి ప్రభావం లేదని తెలిపారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఎలాంటి అవగాహన లేకుండా వాగ్ధానాలు చేస్తున్నారని తెలిపారు. ఆయన అమాయకత్వానికి నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలువడం లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలు అధికారం కోసం రాజకీయం చేస్తున్నారు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. రాజకీయాలకు కొత్త ఒరవడి చూపి అభివృద్దిని ఎజెండాగ ఆచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు.