తప్పుకున్న భారత జట్టు ట్రైనర్!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న శంకర్ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు. గత ఏడాది శ్రీలంకతో సిరీస్‌కు ముందు జట్టుతో చేరిన బసు కారణంగానే ఇటీవల ఆటగాళ్ల ఫిట్‌నెస్ అద్భుతంగా మెరుగుపడింది.
తమలో మార్పుకు బసునే కారణమంటూ కెప్టెన్ కోహ్లి కూడా తరచుగా ప్రశంసించాడు. అయితే జట్టులో కొంత మంది ఆటగాళ్లు గాయాలపాలు కావడానికి అదే కారణమని విని పించింది. తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా బసు ట్రైనింగ్ చేయించారంటూ కొందరు ఆటగాళ్లు బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శంకర్ బసు రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదంచలేదు.