తమిళనాట బ్రాహ్మణెళితర పూజారులు
చెన్నై,అగస్టు16(జనంసాక్షి): తమిళనాడులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణెళితరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు కూడా పూజారులుగా మారనున్నారు. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణెళితరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాల వారు, ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు. మరోవైపు బ్రాహ్మణెళితరులను పూజారులుగా చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.