తమిళనాడుకు నీరు వదలాలని ఆదేశం

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రధాని నేతృత్వంలోని కావేరీ నదీజలాల ప్రాధికార సంస్థ (సీఆర్‌ఏ) ఆదేశాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్‌ఏ ఆదేశాన్ని అమలుచేయనట్లైతే తామే స్వయంగా సముచితమైన ఆదేశాలు జరీచేయాల్సి ఉంటుందని జస్టిస్‌ డీకే జైన్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కర్ణాటక సర్కారుని హెచ్చరించింది. ”ప్రధానమంత్రి అధ్యక్షతన గల సీఆర్‌ఏ జారీచేసిన ఆదేశం ఇది. మీరు దీన్ని అమలుచేయాలనుకోవట్లేదా. ఒక అత్యున్నత ప్రాధికార సంస్థ జారీచేసిన ఆదేశాలపై మీరు ఎటువంటి గౌరవాన్ని కలిగిఉన్నారో దీన్ని బట్టి తెలుస్తోంది. 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని, దీనికి సంబంధించి వారం రోజుల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. కర్ణాటక సర్కారు సీఆర్‌ఏ ఆదేశాన్ని పాటించేలా చేసేందుకు ఆ రాష్ట్రంలో సైన్యాన్ని మోహరింపజేయాలని కూడా ఆదేశించాలన్నారు.