తమిళనాడులో ఘోర విషాదం
గోడ కూలిన ఘటనలో 9మంది మృతి
చెన్నై,నవంబర్19(జనం సాక్షి ) : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక గోడ కూలింది. ఈ ఘటనలో నలగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. గోడ కూలడంతో నలుగురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది.పలువురు గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గోడ కూలిన ఆ ప్రాంతంలో 50కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.