తమిళనాడు కూనూరు వద్ద కూలిన సైనిక హెలికాప్టర్
కూలి మంటల్లో దగ్ధం అయినట్లు గుర్తింపు
హెలికాప్టర్‌లో డిఫెన్స్ చీఫ్ రావత్ సహా పలువురు ప్రముఖలు
మొత్తం14మంది సైనికాధికారులు మృత్యువాత పడ్డట్లు అనుమానం
చెన్నై,డిసెంబర్8 జనం సాక్షి :తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధి కారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు బిపిన్ రావత్ అని తెలుస్తోంది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తమిళనాడులోని కూనూరులో సాంకేతిక లోపం వల్ల అత్యున్నత సైనిక హెలికాప్టర్ కూలింది. కూలిన చాప్టర్ మంటల్లో చిక్కుకోవడంతో అందులోని వారంతా కాలి బూడిదయ్యారని భావిస్తున్నారు. హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి ఉన్నారని భారత వాయు సేన తెలిపింది. ఇంజిన్ వైఫల్యం వల్ల కోయంబత్తూరు, సూలూరు మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. దీనిలో కొందరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. జనరల్ రావత్ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఈ హెలికాప్టర్లో ప్రయాణించారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఐఏఎఫ్ ఎంఐ`17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సవిూపంలో ప్రమాదానికి గురైందని పేర్కొంది. దీనిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్లో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్, లెప్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తం విూద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని కూనూరు అటవీప్రాంతలో బిపిన్‌రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైందని, వీరు ప్రయాణిస్తున్న ఎంఐ`17 చాపర్ అకస్మాత్తుగా చెట్లపై కూలిపోయింది. ఈ క్రమంలో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. సైనికులు మంటల్లోంచి ముగ్గురుని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ`17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నట్లు తెలిసింది. 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. ఈ ఘటనకు సంబంధించిన
సమాచారన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేందర మోడీకి చేరవేశారు. దీనిపై ఆయనపార్లమెంటులో ప్రకటనచేసే అవకాశం ఉంది.