తలసాని ఆధ్వర్యంలో దళితసభకు నేతలు


భారీగా తరలిని నియోజకవర్గ నాయకులు
హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ లో జరిగే దళిత బంధు సభకు సనత్‌ నగర్‌ నియోజకవర్గ దళితులు, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేసేందుకు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దళిత బంధుపథకం ద్వారా దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనున్నది. దళిత బంధు పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పల్లెలన్నీ శాలపల్లి వైపు కదులుతున్నాయి. దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి దళితులందరూ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో దళితులు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరుతున్నారు. జై కేసీఆర్‌, జై తెలంగాణ నినాదాలతో ప్లలెలన్నీ మార్మోగిపోతున్నాయి.
దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఏర్పడిరది.