తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక
చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఒక బాలిక తన పెళ్లి విషయమై తల్లి వేదిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పానేటి లక్ష్మి తన పెద్ద అల్లుడు మొగలి సంపత్‌ను పెళ్లిచేసుకొవాల్సిందిగా చిన్న కుమార్తెను తరచూ వేధిస్తోంది. దీనిపై ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు శిశు సంక్షేమశాఖ అధికారులకు పోలీసులు8 సమాచారమందించారు.