తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం
విజయవాడ, జూన్ 24 :
కుటుంబాల కలహాల నేపథ్యంలో తల్లీకూతురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో మూడేళ్ల చిన్నారితో కలిసి కనకదుర్గ అనే మహిళ కృష్ణానదిలో దూకింది. స్థానికులు గమనించి చిన్నారిని రక్షించగలిగారు. కనకదుర్గ మాత్రం కొట్టుకుపోయింది. ఆమె కోసం గాలిస్తున్నారు.