తహసిల్దార్ కు మెమోరాండం అందజేసిన వరద ముంపు బాధితులు.
– సకినాల ప్రశాంత్ నాయుడు ఆధ్వర్యంలో…
– మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద అడవిలో దీక్ష కొనసాగింపు.. అక్కడే వంటా వార్పు…
బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ లో సకినాల ప్రశాంత నాయుడు ఆధ్వర్యంలో ఇటీవల సంభవించిన గోదావరి వరదల కారణంగా 11 రోజుల గా మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద అడవిలో టెంటు వేసుకొని భోజన సదుపాయం ఏర్పరచుకొని వరద ముంపు బాధితులు ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య నగర్, పాత సారపాక, మసీదు రోడ్డు, బస్వప్ప క్యాంప్, పంచాయతీ ఆఫీస్, గాంధీనగర్ కనకదుర్గమ్మ గుడి, కృష్ణుడు గుడి, సెక్యూరిటీ క్యాంప్, బొగ్గు గడ్డ, ఒడియా క్యాంప్ ఏరియాల తదితర ప్రాంతాలు ముంపునకు గురి అవుతున్నాయన్నారు. శనివారం ధర్నా శిబిరం నుంచి స్థానిక మండల ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు పాదయాత్రగా బయలుదేరగా శ్రీరాంపురం పార్కు వద్ద స్థానిక ఎస్సై సంతోష్ ఆపి పాదయాత్రగా కాదు ముందుగా 10 నుంచి 15 మందితో ఎమ్మార్వోకి మెమోరాండం ఇవ్వమని సూచించగా, ఎమ్మార్వో కి ఎస్సై సంతోష్ సమక్షంలో బాధితుల డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశామన్నారు. గోదావరి వరద ముంపు బాధితుల డిమాండ్లు: మాకు పూర్తిస్థాయిలో మెట్ట ప్రాంతంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి, గోదావరి ముంపుకు గురైన ఇళ్ళకి పక్కాగా నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మి , కె.యం.విజయ, తోట సీత, నిమ్మకాయల అనంతలక్ష్మి, తోడేటి సావిత్రి, సత్రాల భవాని, యస్ కె.ముంతాజ్ బేగం, జీనత్, సాగరిక, బూరం కుమారి, పాల్ ప్రసాద్, జానీ, కె.సాయి పాష, కె శ్రీను , యస్ కె రఫీ తదితరులు పాల్గొన్నారు.