తాండూరు నియోజకవర్గ అభివృద్దే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంకల్పం.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు అన్నారు. తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులుపెడుతున్నాయని ,బైపాస్ పనులు వేగవంతంగా జరుగుతున్నయ ని.ఎన్నికల హామీకి కట్టుబడి కాలుష్య రహిత తాండూరు దిశగా ప్రణాళికాబద్ధంగా ఎమ్మెల్యే పైలెట్ రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నారన్నారు. పట్టణంలో నలుమూలల రోడ్ పనులు మరియు పట్టణ సుందరికనికి ప్రత్యేక కార్యాచరణ చెయ్యడం జరిగిందని,రోడ్ డివైడింగ్ ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనం పెంపొందెలా మొక్కలను సైతం నాటడం జరిగిందని, పట్టణం లో అంతర్గత రోడ్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపనలు చేయడం జరిగిందని,16 కోట్ల టియుఎఫ్ఐడిసి ప్రత్యేక నిధులతో చిలుకవగు అభివృద్ధికి నోచుకునేల త్వరలో నాల నిర్మాణం చెప్పట్టబోతున్నామని ,ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.