తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి 10కోట్ల నిధులు మంజూరు హర్షణీయం.

వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)రంగరెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్  ప్రకటించిన విధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో గల ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు విడుదల చేయడం ఎంతో హర్షణీయ మని తాండూరు మున్సిపల్ వైస్
చైర్ పర్సన్  పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రదాత సీఎం కేసిఆర్ కు ప్రజల పక్షాన ఆమె కృతజ్ఞతలు తెలిపారు.తాండూరు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్  ప్రకటించిన ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధిలో తాండూరు ను నడిపిస్తారని దీప నర్సింలు
పేర్కొన్నారు.
Attachments area