తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి
సంపూర్ణ సురక్ష క్లినిక్ గా ఎంపిక.
తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి
సంపూర్ణ సురక్ష క్లినిక్ గా ఎంపిక అయింది. ఇందులో భాగంగా నే సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టీమ్ జిల్లా ఆసుపత్రి లో నీ ఏ.ఆర్.టీ.సెంటర్, ఐ. సి.టీ. సి. ఎస్.టీ. ఐ.క్లినిక్ ను సందర్శిం చారు. జిల్లా ఆసుపత్రి లో హెచ్ఐవి/హెచ్ఆర్ జి వారికి అందిస్తున్న సేవల ను గుర్తించి రాష్ట్ర స్థాయిలో మూడు కేంద్రాలను ఎంపిక చేశారు .అందులో తాండూరు జిల్లా ఆసుపత్రి సంపూర్ణ సురక్ష క్లినిక్ ను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమా నికి రాజీవ్ సింధు,ఎన్ ఎ సి ఓ( టి ఐ బి ఎస్ డి)
,వేదాంత నాకో ఆఫీసర్,డాక్టర్ ముర్లిధర్,
టీఎస్ ఏ సి ఎస్ జాయింట్ డైరెక్టర్,ఆంటోనీ, టీఎస్ ఏ సి ఎస్ ఆఫీసర్, సుబ్బులక్ష్మి, టీఎస్ ఏ సి ఎస్ ఏపీ డ పేసి టి బి హెచ్ ఐ వి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి రవి శంకర్ , ఆర్.యం.ఓ.ఆనంద్ గోపాల్ రెడ్డి, ఏ.ఆర్.టీ. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణ బాబు ,డాక్టర్ సమిఉల్ల డాక్టర్ కళ్యాణ్ మోహన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area