తాండూర్ నియోజకవర్గ కార్పెంటర్ల

అధ్యక్షునిగా ఈర్షద్.
తాండూరు సెప్టెంబర్ 22 (జనం సాక్షి)వికారాబా ద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కార్పెంటర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా ఈర్షాద్ ను ఏకగ్రీ వంగా గురువారం ఎన్నుకున్నారు.ఈ సందర్భం గా అసోసియేషన్ సభ్యులు శాలువా పూలమా లతో ఘనంగా సన్మానించారు.నియోజకవర్గ కార్పెంటర్ల అసోసియేషన్ నూతన అధ్యక్షులు ఈర్షాద్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నం దుకు ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. కార్పెంటర్ ల ప్రతి సమస్యను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పురేందర చారి, మాజీ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, సభ్యులుపాండురంగా చారి, ఇస్మాయిల్, కాలప్ప తదితరులు పాల్గొన్నారు.