తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.
జనం సాక్షి అక్టోబర్ 13 మంచిర్యాల జిల్లా//
తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మండల కార్యదర్శి సాలిగామ సంతోష్ మాట్లాడుతూ ప్రజా పోరాటం లో గుండా మల్లేష్ పాత్ర చాలా చురుకైన దని పేర్కొంటూ ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మామిడాల రాజేశం,మాజీ అద్యక్షులు కామెర మల్లమ్య ,కోలిపాక బాస్కర్ ,వైనాల సారయ్య ,పట్టి శంకర్ , యువజన నాయకులు ఎడ్ల గోపాల్ ,బాల సంతోష్ ,కోలిపాక శ్రీనివాస్ ,రామ్ తదితరులు పాల్గొన్నారు.