తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
చిన్నారులకు పండ్లు పంపిణీ చేస్తున్న తాజ్ బాబా సేవా సమితి సభ్యులు.
బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం తిర్యాణి మండలం లోని కుగ్రామమైన గౌరుగూడలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషా మాట్లాడుతూ మహాత్ముని జన్మదిన వేడుకలు తాము ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈరోజు ఈ దట్టమైన అటవీప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్న గాంధీ గారి మాటలను గుర్తుచేశారు. అదేవిధంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ క్రీడాలో మంచి పట్టు ఉందని తెలుసుకుని వారికీ త్వరలో వాలీబాల్ కిట్ ని అందజేసి వారికీ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు అబ్బుసాత్, ఆడిచెర్ల హరీష్, మొహమ్మద్ హాజి బాబా తదితరులు పాల్గొన్నారు