తాతయ్య, బాబాª`ల ప్రభావం ఉంది
బింబిసార చిత్రంపై నందమూరి కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా బింబిసారను భారీ సోషియో ఫాంటసీ మూవీగా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ బ్జడెట్ కేటాయించి తెరకెక్కించారు. ఇటీవల బింబిసార ట్రైలర్ రిలీజై యూట్యూబ్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి అందరిలో భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఈ మూవీ ఆగష్టు 5న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ తో పాటుగా బింబిసార మూవీ గురించి తాజాగా తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఛానల్ లో ’అప్ క్లోజ్ విత్ ఎన్కేఆర్’ వీడియోస్ ద్వారా ఫ్యాన్స్ తో, ఆడియన్స్ తో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తాతయ్య ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ చేసిన పలు సినిమాలు తమపై ఏరకంగా ప్రభావం చూపాయి.. అనే విషయాలు చెప్పుకొచ్చారు. తాతయ్య కెరీర్ లో చేసిన అనేక జానపద, పౌరాణిక సినిమాలు మాకు నాన్న హరికృష్ణ చిన్నపుడు చూపిస్తుండేవారు. అలానే కొన్నేళ్ల తర్వాత బాబాయ్ బాలయ్య కూడా ఆ తరహా సినిమాలు చేయడం, వాటిని మేము చూస్తూ ఎదగడం జరిగింది. అలాగే, తమ్ముడు ఎన్టీఆర్ చేసిన యమదొంగ, ప్రభాస్ చేసిన బాహుబలి తరహా సినిమాలు చేయాలనే ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ సమయంలో తొలిసారిగా దర్శకడు వశిష్ట దగ్గరి నుండి నాకు వచ్చిన ఒక మెసేజ్ ఇప్పుడు చేసిన బింబిసార సీమాకు మొదటి బీజం పడటానికి కారణం’..అని తెలిపారు కళ్యాణ్ రామ్.